ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 28న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అతీక్ అహ్మద్ (60), అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది తీసుకువెళుతుండగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే.