Vinayaka Nimajjanam: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గణేష్ పండగ చాలా ముఖ్యమైనదని, ఇరవై వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్నారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం తమకు ఛాలెంజింగ్ అని బందోబస్తు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. రూట్ ఇన్స్‌ఫెక్షన్స్ చేసి…