ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి అనేక దేశాల్లో కరోనా తిరిగి విజృభిస్తున్నది. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటికీ ఆ దేశంలో వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.…