ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల్లో ఎక్కువగా బాధపడుతున్నది మెగాభిమానులే. ఎందుకంటే… అందరి హీరోల సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ షూటింగ్ మొదలు పెట్టి రెండేళ్లు దాటిన గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మొన్న ఇండియన్ 2 డబ్బింగ్ వల్ల… గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందనే క్లారిటీ మాత్రం ఇచ్చాడు శంకర్. ఇప్పటి వరకు టైటిల్ వీడియో, ఓ పోస్టర్ తప్పితే గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు…