GAMA Awards: దుబాయ్‌లో జరిగే గామా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది దుబాయ్ లో AFM ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ చేసే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది.మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో గామా అవార్డ్స్ వేడుకను, గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్ గా నిర్వహించారు.