India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.