సుప్రసిద్ధ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం సంస్థ నుండి ఓ యువ కథానాయకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిని సాయి కొర్రపాటి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో గ్రాండ్ గా జరుగబోతోంది. కన్నడ చిత్రం ‘మాయాబజార్’ను తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్.…