టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు ఊరట లభించింది. గాజువాక మెయిన్ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేతకు బాధ్యులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యక్షంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, ప్లానింగ్ సూపర్ వైజర్ వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినయ్ ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ…