దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొదటి సెషన్‌లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్‌ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
G20 Dinner Menu: జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు.
G20 Summit 2023: జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు.
దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది.
ఢిల్లీలో జీ20 సమ్మిట్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడారు. జీ20 సమ్మిట్ ముగింపులో న్యూఢిల్లీ నాయకుల ప్రకటన గ్లోబల్ సౌత్ స్వరాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
G20 Summit: ఢిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 విందుకు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ హాజరుకావడం లేదని వార్తలు వచ్చాయి.
G20 Summit 2023: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నేతల రాక ప్రక్రియ ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విమానంలో బయలుదేరి సాయంత్రంలోగా భారత్ చేరుకోనున్నారు.