Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
Poonch terror attack: గురువారం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిలో మొత్తం 7 గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రెండు ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు పాల్గొన్నట్లు తేలింది.