Ramesh Rathod: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొదటగా ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరలిస్తున్న మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. దాంతో రమేశ్ రాథోడ్ మృతదేహనన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు…