మయన్మార్ (Myanmar)లో గత కొద్దిరోజులుగా అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో భారతీయులను అక్కడికి వెళ్లొద్దని ఇప్పటకే కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్ (India)లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి…
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.