మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన…