నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.