పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు మొహాలీ ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా ఆయనకు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.