ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం రాత్రి బస చేయనున్నారు. అయితే ప్రధాని మోడీని మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుటుంబం కలిసింది
పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…