తెలంగాణలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా తనిఖీలు నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.