కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్…