దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంద్రప్రస్థ అపోలోలో చేర్పించారు. ఇంద్రప్రస్థ అపోలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఎల్‌కె అద్వానీని వైద్య నిర్వహణ, పరీక్షల కోసం ఐసీయూలో చేర్చారు.