Ford: అమెరికన్ ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి రాబోతోంది. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలోని తమిళనాడులో ఎగుమతుల కోసం తన తయారీ ప్లాంట్‌ని పున: ప్రారంభించాలని యోచిస్తోంది. మూడేళ్ల క్రితం దేశంలో ఇతర కార్ తయారీ సంస్థలతో పోటీని తట్టుకోలేక ఇండియా నుంచి నిష్క్రమించింది.