కార్ల తయారీదారు ఫోర్డ్ తన పాత కారు ఫోర్డ్ కాప్రీని కొత్త లుక్ లో ముందుకు తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోర్డ్ కాప్రీని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురాబోతోంది. దీనిని మాంచెస్టర్ యునైటెడ్- ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటగాడు ఎరిక్ కాంటోనా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ఐదు డోర్లతో రాబోతుంది. ఇటీవల యూరోపియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారుకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.