మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.. ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ… మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.. Read Also: Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య.. ఇక, ఆహార వస్తువులు మరియు ముడి చమురు ధరలు…
దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న…
టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం రెడీ అయింది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానున్నారు. ఇప్పటికే నగరం అంతా గులాబీమయంగా మారింది. ఎటుచూసినా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. భాగ్యనగరం అంతా గులాబీనగరంగా మారిపోయింది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతం అంతా సందడిగా మారిందని చెప్పాలి. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని నిర్ణయంపై ఆసక్తిగా మారింది శ్రీలంక రాజకీయం. రాజీనామా చేసిన వారిలో ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు క్రీడా శాఖమంత్రి నమల్ రాజపక్సే కూడా వున్నారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు కూడా వుంటారు. రాజకీయ సుస్థిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక…