ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఫైయాష్ కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైయాష్ కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తమలో తామే దాడులకు పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్లైయాస్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పాండ్ యాష్ ప్లాంట్ లో లోడింగ్ అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.…