Floods In Vijayawada: విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది. హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది. కొన్ని వరదకు కొట్టుకుపోయి అక్కడక్కడ చిక్కుకుపోయాయి. వాన తెరిపివ్వడం, వరద తగ్గుముఖం పడుతుండటంతో ఓ పక్క ఇళ్లు సర్దుకుంటూనే ఇంకోపక్క కనిపించకుండాపోయిన తమ పెంపుడు కుక్కల కోసం వెతుక్కుంటున్నారు యజమానులు. నాలుగైదు రోజుల తర్వాత కనిపించిన యజమానులను చూసి ఆ కుక్కలు, వాటిని చూసుకున్న యజమానుల ఆనందం చెప్పతరం…