Tamil Nadu Rains.. floods in chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవితం స్తంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో శుక్రవారం రోజు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వరద గుప్పిట చెన్నై ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.