Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరస ప్రమాదాలతో సతమతమవుతోంది. సాంకేతిక సమస్యలు, పక్షుల తాకిడి వంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా, కొలంబో నుంచి చెన్నై వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…