మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్లబడిన వాతావరణం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగాలు ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే…