First Mobile Phone Call: ప్రస్తుతం భారత్ దేశం డిజిటల్‌గా మారుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి ఒక పరివర్తన వస్తుందని కనీసం ఊహించలేని పరిస్థితి ఉండేది.
నేటి యుగంలో ఫోన్‌లు నిత్యావసరంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు, అది అందించే అనేక రకాల ఫీచర్లు, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు.