Massive Fire Incident: హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశారు. అయితే, మంటలు పక్కనే ఉన్న…
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు…
Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. పెద్దెతున్న మంటలు ఆకాశాన్నంటాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాలుగు ఫైరింజన్లు…
హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. బస్సుల స్క్రాప్ గోదాంలో మంటల చెలరేగాయి. మంటల దాటికి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో…
దేశ రాజధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఐదు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇతర సివిల్ ఏజెన్సీ ఉద్యోగుల సహాయంతో శిథిలాలను తొలగించడం ప్రారంభించారు. శిథిలాల నుంచి నలుగురిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.