అంతర్జాతీయ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. నార్డిక్ దేశమైన ఫిన్లాండ్ తీరుపై రష్యా మండిపడుతోంది. ఫిన్లాండ్ త్వరలో నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. వెంటనే నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని వారిద్దరూ పిలుపునిచ్చారు. రానున్న మరికొన్నిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని…