Today Business Headlines 07-04-23: ‘సచిన్’కి తనిష్క్ కానుక: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.