Arvind Panagariya: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగడియాయ ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది.