సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి తమకు వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆయన, స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోందని అన్నారు. అలాంటిది స్కిల్ లేకుండా ఇప్పుడు ఇంకా జీతాలు పెంచి వాళ్లకు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుందని…