డైరెక్టర్ కొరటాల శివకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన, తర్వాత చేస్తూ వస్తున్న సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన దేవర సినిమా పూర్తి చేసి, దేవర 2 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, దేవర 2 సినిమా క్యాన్సిల్ అయిందని, దీంతో ఆయన మరో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారని ప్రచారం మొదలైంది. దానికి తోడు, నాగచైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో, ఆయన నాగచైతన్యతోనే సినిమా చేస్తున్నారని దాదాపు చాలా వరకు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. అయితే, అది దర్శకుడిగా కాదు. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి యువ సుధా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి, కొరటాల శివ సహకారంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు.
Also Read:Devara 2 : దేవర 2 ఆగిపోయిందా.. అసలు నిజం ఇదే!
కొరటాల శివ ఒకరకంగా ఆ నిర్మాణ సంస్థలో భాగస్వామి అని చెప్పొచ్చు. ఆయన ఆ నిర్మాణ సంస్థ ద్వారా వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలతో భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన నాగచైతన్యతో భేటీ అయ్యారు. నాగచైతన్యతో మాత్రమే కాదు, పలువురు హీరోలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అలాగే, పలువురు దర్శకులతో కూడా భేటీ అయ్యారు. ఇక్కడ ఆయన నాగచైతన్యతో సినిమా నిర్మాతగా చేయాలనుకుంటున్నారు, కానీ దర్శకుడిగా ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఏమైనా చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన నిర్మాతగానే సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే, ఆ విషయం బయటకు మాత్రం వేరేగా ప్రొజెక్ట్ అయి, నాగచైతన్య హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రచారం మొదలైంది అన్నమాట.