సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటల సందడి. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే చిరుతిళ్లలో ‘వెన్న ఉండలు’ ఒకటి. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోయే ఈ తీపి వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాను చూడండి. దీని కోసం ముందుగా ఒక కేజీ బియ్యం పిండి తీసుకుని, అందులో తగినంత ఉప్పు, ఒక క్రికెట్ బాల్ సైజు అంత స్వచ్ఛమైన వెన్న వేసి బాగా కలుపుకోవాలి .…