ఎరువుల ధరలను పెంచకూడదని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్-సెప్టెంబర్ ఖరీఫ్ లేదా వేసవి సీజన్ కోసం రూ.1.08 లక్షల కోట్ల పంట-పోషక సబ్సిడీని ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో యూరియాతో సహా అన్ని కీలక ఎరువుల కోసం తగినంత నిల్వలు, ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.