సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల పెంపుపై అటు ఫెడరేషన్ నాయకులకు ఇటు నిర్మాతలకు మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ చర్చలు త్వరగా ముంగిచాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం 10గంటలకు ఇందిరా నగర్ లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం కాబోతున్నారు. సర్వసభ్య సమావేశం అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి…
కార్మిక సంఘాల సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఈ బంద్ పై కొందరు తెలుగు చలన చిత్ర నిర్మాతలు ఇన్ సైడ్ గా మాట్లాడుతూ ’50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు తీయలేరు, వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తున్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు.…