ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.