కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న…