Team India: టీమిండియా సీనియర్ క్రికెటర్ పుజారా చాన్నాళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఏమైనా జరగొచ్చు. అయితే పుజారా మాత్రం ఎంతో సహనం ప్రదర్శించి నిలకడగా ఆడుతున్నాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయినా మనోనిబ్బరం కోల్పోకుండా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీ బాది విమర్శకుల నోళ్లను మూయించాడు. 1,443…
ఇటీవల గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ మైదానంలో తన విశ్వరూపం చూపించాడు. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 64 బంతుల్లోనే సెంచరీ చేసి తనలోని సత్తాను బయటపెట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్ వేసిన ఒకే ఓవర్‌లో 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు, ఫోర్ సాధించాడు. దీంతో…