ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. తుది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు అంకిత తండ్రి, సోదరుడు ఆమె అంత్యక్రియలు చేయడానికి మొదట నిరాకరించారు. అనంతరం మనస్సు మార్చుకుని అంత్యక్రియలు నిర్వహించారు.