ఎమ్‌ఎస్‌పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్‌కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును…