సినిమా స్టార్లకు అభిమానులు ఉండడం సహజమే.. కానీ ఆ అభిమానం మీతిమీరితేనే సమస్య. తమ అభిమానం హీరో సినిమా బాగోకపోయినా, టిక్కెట్ దొరకకపోయినా పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక బాలుడు.. ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి…