False Tsunami Alert Goa: సునామీ.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాణాలు ఈ సునామీకి బలైపోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లే ఈ సునామీల కారణంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు దేశంలో అత్యంత రద్దీగా ఉండే టూరిజం స్పాట్ గోవాలో కూడా జనం సునామీ రాబోతుందను కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. అర్థరాత్రి మోగిన సునామీ సైరన్ వారి కంట కునుకు లేకుండా చేసింది.…