రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఇవాళ (గురువారం ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటి ఇచ్చారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో హరీష్ రావు పర్యటించారు. బోనాల కెనాల్ లోకి సాగు నీటి కోసం గోదావరి నీటిని విడుదల చేశారు.