Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు.