అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్…
Minister Partha Sarathy: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని మంత్రి పార్థసారథి తెలిపారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుంది.. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది.. గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని మండిపడ్డారు.
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
Off The Record: పార్టీ ఏదైనా, అధికారం ఎవరిదైనా… ఏపీలో ఇప్పుడు కేసులు, కోర్ట్‌లు కామన్ అయిపోయాయి. ఈసారి కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక కూడా…ఇదే తంతు కొనసాగుతోంది. రకరకాల కేసుల్లో ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళకు బెయిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొందరు అరెస్ట్, వాళ్ళకు కూడా బెయిల్స్…. ఇలా అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు మరుగునపడిపోయి.. ఈ కొసరు విషయాల చుట్టూనే జనంలో కూడా చర్చ జరుగుతున్నట్టు కాస్త ఆలస్యంగా గుర్తించిందట టీడీపీ అధిష్టానం. అందుకే…
Off The Record: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్న నకిలీ మద్యం ఎపిసోడ్ ఇప్పుడు కూటమిలో కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దాని గురించి ఆ స్థాయి రచ్చ అవుతున్నా… వైసీపీ ఒంటికాలి మీద లేస్తూ టార్గెట్ చేస్తున్నా… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదన్న డౌట్స్ వస్తున్నాయట కూటమి సర్కిల్స్‌లో. అంటే నకిలీ మద్యం వ్యవహారాన్ని కేవలం టీడీపీ సమస్యగానే డిప్యూటీ సీఎం చూస్తున్నారా?…
Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు.. ఈ కేసులో ఏ15గా ఉన్న రమేష్, ఏ16గా అల్లా భక్షు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.. ఈ ఇద్దరి అరెస్ట్ తో నకిలీ మద్యం కేసులో నిందితుల అరెస్ట్ సంఖ్య 10కి చేరింది.. Read Also: Transgender: కీలక నిర్ణయం.. తొలిసారిగా…
Jogi Ramesh Open Challenge: ఏపీ ఫేక్ లిక్కర్ కేసు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడంతో ఆసక్తికరంగా మారగా.. నేను లై డిటెక్టర్ టెస్ట్ రెడీ.. మీరు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు జోగి రమేష్ సవాల్ చేశారు.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన జోగి రమేష్.. తనపై సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ లో వచ్చే ఫేక్ వార్తలపై…
Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది.. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్రియాశీల క్షేత్రస్ధాయి నాయకత్వం ఉంది..…
MLA Vasantha Krishna Prasad: వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్ధన్‌రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు.. నకిలీ మద్యంపై జోగి రమేష్ అనుచరుడే సమాచారం ఇచ్చారు.. జోగి రమేష్ అనుచరుడు సురేష్ ఎక్సైజ్‌శాఖకు తెలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. జోగి రమేష్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు…
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు.