ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో…