2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.…