Srikakulam : గుర్రాలను చూసుకుంటూ సాయంగా ఉంటాడని యజమాని పనిలో పెట్టుకున్నాడు. కానీ.. తన భార్యతోనే అక్రమ సంబంధం కొనసాగించి తిన్న ఇంటికే కన్నం పెట్టాడు. దీంతో తట్టుకోలేని యజమాని తన అసిస్టెంట్ను చంపి పాతేశాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గుర్రపు స్వారీ శిక్షకుడి సహాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు.